WGL: భూ భారతి స్కామ్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి మొదలు మండల స్థాయి అధికారుల వరకు కలిసి దళారులతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయాలు నష్టం జరుగుతున్నా CM స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు భూ భారతి స్కామ్‌తో ప్రభుత్వానికి గండి కొడుతోందని అన్నారు.