»Umesh Yadav Has Been Blessed With A Baby Girl Second Time
Umesh Yadav విషాదం నుంచి ఆనందంలోకి.. భారత క్రికెటర్ ఉమేశ్ ఫుల్ హ్యాపీ
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విషాదం నుంచి సంతోషంలోకి మారాడు. గత నెలలో తండ్రి మృతి చెందగా.. తాజాగా అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పాప రాకతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది. ఉమేశ్ భార్య తన్య మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పాపకు జన్మనివడం విశేషం. ఈ విషయాన్ని ఉమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విషాదం నుంచి సంతోషంలోకి మారాడు. గత నెలలో తండ్రి మృతి చెందగా.. తాజాగా అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పాప రాకతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది. ఉమేశ్ భార్య తాన్య వాద్వా మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పాపకు జన్మనివడం విశేషం. ఈ విషయాన్ని ఉమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
ఉమేశ్ కు ఇదివరకే పాప ఉంది. మళ్లీ రెండోసారి అతడికి పాప పుట్టింది. ఈ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఉమేశ్ అభిమానులతో పంచుకున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ అయిన పంజాబీ అమ్మాయి తాన్య క్రికెట్ కు వీరాభిమాని. 2010లో ఐపీఎల్ మ్యాచ్ లో ఉమేశ్ ను కలిసింది. తొలి చూపులోనే ఉమేశ్ తాన్యపై మనసు పారేసుకున్నాడు. ఓ స్నేహితుడి ద్వారా వీరిద్దరికి పరిచయమైంది. అనంతరం వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు వీరిద్దరూ సహ జీవనం చేశారు. ఆ తర్వాత 2013లో ఉమేశ్, తాన్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఒక పాప. తాజాగా మరో పాపకు తాన్య జన్మనిచ్చింది. తండ్రి మరణం తర్వాత పాప రావడంతో ఉమేశ్ ఆనందంలో మునిగాడు. తండ్రి ఆశీస్సులు తనకు ఉంటాయని ఉమేశ్ భావిస్తున్నాడు.
ఉమేశ్ యాదవ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లా. తిలక్ యాదవ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉమేశ్. బొగ్గు గనిలో ఉద్యోగం రావడంతో ఉత్తరప్రదేశ్ వదిలేసి మహారాష్ట్రలోని నాగ్ పుర్ సమీపంలో ఉన్న ఖపర్ఖేడాకు వలస వచ్చారు. మిలన్ చౌక్ లో నివసిస్తున్నారు. మొదట్లో వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది. కుమారుడు ఉమేశ్ యాదవ్ క్రికెట్ లో రాణించాడు. కాగా ఉమేశ్ తండ్రి ఫిబ్రవరి 23వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమేశ్ రంజీ క్రికెట్ లో సత్తా చాటాడు. అక్కడ అతడి ప్రతిభ చూసి బీసీసీఐ భారత జట్టులోకి చోటు కల్పించింది. 2010 ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఉమేశ్ ను సొంతం చేసుకుంది. నవంబర్ 2011లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో ఉమేశ్ అరంగేట్రం చేశాడు. విదర్భ తరఫున టెస్టు మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా ఉమేశ్ గుర్తింపు పొందాడు.