Allu Arjun : ప్రస్తుతం సోషల్ మీడియాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'పుష్ప2'లో సాయి పల్లవి కూడా జాయిన్ అవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలె 'పుష్ప2' సెట్స్‌లో జాయిన్ అయింది హాట్ బ్యూటీ రష్మిక.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప2’లో సాయి పల్లవి కూడా జాయిన్ అవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలె ‘పుష్ప2’ సెట్స్‌లో జాయిన్ అయింది హాట్ బ్యూటీ రష్మిక.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో నటించబోతునందనే న్యూస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలోనే ఈ బ్యూటీ పుష్ప2లో నటించబోతుందనే ప్రచారం జరిగింది. కానీ అఫీషయల్ కన్ఫర్మెషన్ లేదు. అయితే ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని కలిసి ఆమె పాత్ర గురించి చెప్పాడట. ఆమె కూడా తన క్యారెక్టర్ నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేసిందట. సినిమాలో సాయి పల్లవి రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంట. అంతేకాదు కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ అని తెలుస్తోంది. కాకపోతే నిడివి చాలా తక్కువ అని అంటున్నారు. అయినా సాయి పల్లవి నిజంగానే పుష్ప2లో నటిస్తే మాత్రం.. సినిమా పై మరింత వెయిట్ పెరిగినట్టే. అయినా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప2 టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆరోజే సాయి పల్లవి గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఒకవేళ పుష్పరాజ్‌తో కలిసి సాయి పల్లవి నటిస్తే.. ఆమె అభిమానులకు పండగేనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాల్సింటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.