Summer Affect ఏసీలో పేలుడు.. మంటల్లో బూడిదైన భార్య, ఇద్దరు పిల్లలు
వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఉష్ణోగ్రత్తలు (Temperature) పెరుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎండపట్టున (Summer) ఉండకూడదు. బయట ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇంట్లో అధిక మోతాదులో ఫ్యాన్లు (Fans), కూలర్లు (Coolers), ఏసీ (AC’s)లు వాడుతుంటాం. అవి వాడేప్పుడు జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రమాదాలు సంభవిస్తాయి. విద్యుత్ శాఖ చెబుతున్న జాగ్రత్తలు పాటించకుంటే కర్ణాటక (Karnataka)లో జరిగినట్టు ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా (Raichur District)లో ఘోర సంఘటన జరిగింది. వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణకు సమీపంలోని రాయచూరు తాలుకా శక్తినగర్ లో థర్మల్ కేంద్రం (Singrauli Super Thermal Power Station) ఉంది. ఆ కేంద్రంలో మాండ్య జిల్లాకు చెందిన సిద్ధలింగయ్య ఏఈగా పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా భార్య రంజిత (33), ఇద్దరు కుమార్తెలు మృదుల (13), తారుణ్య (5)తో కలిసి శక్తినగర్ లోనే నివసిస్తున్నాడు. భర్త ఉద్యోగానికి వెళ్లడంతో రంజిత ఇంట్లో పిల్లలతో కలిసి ఉంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం మధ్యాహ్నం ఏసీ వేసుకుని నిద్రపోయారు. వారు నిద్రపోతున్న సమయంలో ఏసీలో ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. ఆ వెంటనే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగడంతో తల్లితోపాటు పిల్లలు ఆ మంటల్లోనే కాలిపోయారు.
ఈ మంటలతో వారు ఉంటున్న ప్రాంతంలో దట్టంగా పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చి చూసేలోపు రంజిత పిల్లలతో పాటు మృతి చెందింది. ఈ సంఘటనతో అక్కడ విషాద వాతావరణం అలుముకుంది. సమాచారం తెలుసుకున్న సిద్ధలింగయ్య ఇంటికి వచ్చి చూడగా భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉండడంతో బోరున విలపించాడు. మృతదేహాలకు రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శక్తినగర్ పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం వేసవి వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.