»Revanth Reddy Said Kcr Cheating The People In The Name Of Devotion And Development
Revanth Reddy: భక్తి, అభివృద్ధి పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుండు
ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) గతంలో కొండగట్టులో 125 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చి చేయలేదన్నారు.
ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో వచ్చిన వినోద్ కుమార్ కూడా కరీంనరగ్ ప్రాంతం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో అనేక సార్లు ప్రజలు(people) కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా(jagityal)లో పర్యటించిన క్రమంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇంకోసారి భక్తులను, అర్చకులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. భక్తి పేరుతో దోచుకుంటూ.. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) గతంలో కొండగట్టులో 125 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని భక్తులకు హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని రేవంత్ గుర్తు చేశారు.
ఇంకోవైపు కొన్నేళ్ల క్రితం కొండగట్టులో జరిగిన ఘోర ప్రమాదంలో(accident) 70 మందికి పైగా మరణించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆదుకోలేదన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు అసలు చర్యలే తీసుకోవడం లేదని మండిపడ్డారు. అంతేకాదు కొండగట్టు ఆలయం చుట్టూ ఉన్న 800 ఎకరాల అటవీ భూమి(land) ఆక్రమణలకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం కొడిమ్యాల మండలంలోని పోతారం రిజర్వాయర్‌ను పరిశీలించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రైతులతో మాట్లాడారు. రిజర్వాయర్‌కు సంబంధించి బ్రిడ్జి, బండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సుమారు 135 మంది నిర్వాసితులకు పరిహారం మంజూరు చేయలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న పోతారం రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టి ఉంటే కోనాపూర్, సూరంపేట, పోతారం, కొడిమ్యాల రైతులకు సాగునీరు వచ్చేదన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడంలో ఆసక్తి చూపడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు(kaleshwaram project) లక్షల కోట్లు వెచ్చించగలిగిన కేసీఆర్ పెండింగ్‌లో ఉన్న పోతారం రిజర్వాయరుకు రూ.25 కోట్లు ఎందుకు వెచ్చించడం లేదని ప్రశ్నించారు.
దీంతోపాటు ఇష్టాపురం గ్రామంలో బీడీ కార్మికులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్(kcr) కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు ఇచ్చి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కానీ బీడీ కార్మికుల కుటుంబంలో ఒకరికి కూడా పోస్టులు మంజూరు చేయడం లేదన్నారు. కాంగ్రెస్(congress) అధికారంలోకి రాగానే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ ఫించన్లు మంజూరు చేయడంతోపాటు బంగారుతల్లి పథకాన్ని అమలు చేస్తామన్నారు.