ADB: ఉట్నూర్ ఐటీడీఏ నూతన డిప్యూటీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన గోడం చందన్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.