ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి (Government of Andhra Pradesh) రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మండిపడ్డారు. ముఖ్యమంత్రి(chief minister of Andhra Pradesh) జగన్ లో (ys jagan) ఎలాగూ మార్పు రావడం లేదని, ఇక ప్రజలు ఆయనను మారుస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో అధికారులు మరోసారి కూల్చివేతలకు పాల్పడటం పట్ల ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉంటే, ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. ఏదైనా మంచి పని కోసం వెనుకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు… కానీ కసితో ఏదైనా కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దానిని సైకోతత్వం అంటారని చురకలు అంటించారు. మీరు ఎలాగూ మారరు.. ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు అంటూ హెచ్చరించారు.
కాగా గుంటూరు జిల్లా (guntur dist) ఇప్పటం (ippatam) గ్రామంలో శనివారం మరోసారి కూల్చివేతలు చేపట్టారు. ఇతరులు ఎవరు ఊళ్ళోకి రాకుండా అడ్డుకొని ఈ పనులను చేపట్టారు అధికారులు. ప్రహరీలు, ఇనుప గేట్లు, పిట్ట గోడలు కూల్చి వేసారు. ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూల్చివేత కొనసాగింది. ఈ సమయంలో గ్రామస్థులు నిరసన తెలిపారు. ఆటోలు కూడా రాని ఊళ్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం కక్ష సాధింపు కాక మరేమిటి నిలదీశారు. జనసేన పార్టీ ఆవిర్భావానికి భూములు ఇస్తే ఇంతలా వేధిస్తారా అని అవేదన వ్యక్తం చేశారు.