»Singer Benny Dayal Gets Hit By Drone During Live Concert In Chennai
Viral Video : స్టేజ్ మీద పాడుతున్న సింగర్ మీదికి దూసుకొచ్చిన డ్రోన్.. ఆ తర్వాత ఏమైందంటే?
ఈరోజుల్లో డ్రోన్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ తోనే లాంగ్ షాట్ వీడియోలు తీస్తుంటారు. ఆకాశం నుంచి కిందికి ఏవైనా వీడియోలు తీయాలన్నా డ్రోన్స్ వాడాల్సిందే. చాలా సినిమాలోనూ డ్రోన్ షాట్స్ ఉపయోగిస్తారు
Viral Video : ఈరోజుల్లో డ్రోన్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ తోనే లాంగ్ షాట్ వీడియోలు తీస్తుంటారు. ఆకాశం నుంచి కిందికి ఏవైనా వీడియోలు తీయాలన్నా డ్రోన్స్ వాడాల్సిందే. చాలా సినిమాలోనూ డ్రోన్ షాట్స్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఏదైనా ఈవెంట్లలో డ్రోన్స్ తో షాట్స్ తీస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్ లో డ్రోన్ షాట్స్ తీస్తుండగా మిస్ ఫైర్ అయి స్టేజ్ మీద పర్ ఫామ్ చేస్తున్న సింగర్ మీదికే డ్రోన్ దూసుకెళ్లింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
బాలీవుడ్ సింగర్ బెన్నీ దాయల్ చెన్నైలో ఇటీవల కన్సర్ట్ నిర్వహించాడు. ఆ కన్సర్ట్ కు చాలామంది సినీ అభిమానులు తరలి వచ్చారు. ఆయన స్టేజ్ మీద లైవ్ పర్ ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఊర్వశీ ఊర్వశీ అనే ఫేమస్ తమిళం పాటను పాడుతూ ఆడియెన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇంతలో ఆ ఈవెంట్ ను షూట్ చేస్తున్న ఓ డ్రోన్ అక్కడికి వచ్చి ఆ సింగర్ చుట్టూ ఓ రౌండ్ వేసింది. ఆ తర్వాత వెనక నుంచి వచ్చి ఆ సింగర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో పాట పాడుతున్న సింగర్ కాస్త ఒక్కసారిగా కింద కూర్చుండిపోయాడు. ఏమైందో ఒక్క క్షణం సింగర్ కు కూడా అర్థం కాలేదు.
Viral Video : ఆ ఘటన వీడియో వైరల్
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్నీ తలని ఆ డ్రోన్ బలంగా ఢీకొట్టడంతో బెన్నీకి గాయాలయ్యాయి. ఆ ఈవెంట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. బెన్నీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటన తర్వాత సింగర్ బెన్నీ ఇన్ స్టాలో తన ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇచ్చాడు. తనకు స్వల్పంగా గాయాలయ్యాయని, త్వరలోనే రికవర్ అవుతా అని చెప్పుకొచ్చాడు.