»Sketch After Seeing Crime Scenes Shocking Things In Naveens Murder Case
Naveen murder case : క్రైమ్ సీన్లు చూసి స్కెచ్.. నవీన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు
తెలంగాణలోని (Telangana) అబ్దుల్లాపూర్మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.యూట్యూబ్‌లో క్రైమ్ సీన్లు చూసి హరిహర కృష్ణ (Harihara Krishna) తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
తెలంగాణలోని (Telangana) అబ్దుల్లాపూర్మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.యూట్యూబ్‌లో క్రైమ్ సీన్లు చూసి హరిహర కృష్ణ (Harihara Krishna) తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు. హరిహరకృష్ణ సమాధానాలతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఈ హత్య నేనొక్కడినే చేశాని నిందితుడు చెప్పడని పోలీసులు తెలిపారు. తర్వాత బెయిల్ (bail) బయటకొచ్చేస్తా అని చెబుతున్నాడటని వారు వెల్లడించారు.
క్రైమ్ సీన్లు (crime scenes) చూసి.. స్ఫూర్తిగా తీసుకొని నేరం చేసిన తరువాత సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడం ఎలా? ఈ మధ్య కాలంలో కొందరు నేరస్తులు అవలంభిస్తున్న తీరిది. ప్రేమిస్తున్న యువతి తనకు దూరమవుతుందనే కోపంతో తన స్నేహితుడైన నవీన్‌ను అత్యంత కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేసిన విషయం విదితమే.విశ్వసనీయ సమాచారం మేరకు… ఈ కేసులో నిందితుడు హరిహరను అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) పోలీసులు కోర్టు అనుమతితో 7రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడికి పక్కాగా శిక్షపడేలా అన్ని ఆధారాలను సేకరిస్తున్నాం.
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో (Fast track court) విచారణ జరిపిస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ (CP DS Chauhan)తెలిపారు. ఇప్పటి వరకు అమ్మాయి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణ పూర్తయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. అప్పటి వరకు మీడియా సంయమనం పాటించాలని ఆయన వెల్లడించారు. మొత్తానికి చూస్తే.. నవీన్ కేసులో పాత్రధారులెవరు..? సూత్రదారులెవరు..? అని వీలైనంత త్వరగా తేల్చేయాలని రోజుకో కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్‌గా పోలీసులు (Police) ఏం తేలుస్తారో.. ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే మరి.