»Kcr With 9 Members Leaders Letter To Pm Modi On Delhi Liquor Scam
Delhi liquor scam:పై మోదీకి కేసీఆర్ లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని ప్రతి పక్ష నేతలు ఖండించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ(pm modi)కి 9 మంది నేతలు ఆదివారం లేఖ(letter) రాశారు. దేశంలో ప్రజాస్వామ్యం నిరంకుశత్వం దిశగా వెళుతోందని నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి చర్యలే అందుకు ఉదాహారణలని గుర్తు చేశారు. మరోవైపు గవర్నర్లు కూడా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో జోక్యం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇక లేఖ రాసిన వారిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్(KCR), పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్నారు.
మరోవైపు సిసోడియాను అరెస్టుకు సంబంధించిన ఆధారాలను చూపించాలన్నారు. అసలు ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందని వెల్లడించారు. బీజేపీ(BJP)లో చేరకపోతే దాడులు చేయడం సరికాదని పలువురు నేతలు ఎధ్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమనిర్ణయమని ప్రజపక్షాలు పేర్కొన్నాయి. అయితే విపక్ష నేతలు అందరూ ఏకమై లిక్కర్ స్కాం(liquor scam) గురించి లేఖ(letter) రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.