తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వేసవిలోనూ ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, నిన్న దాదాపు మూడు డిగ్రీలు అధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు (Melugu) జిల్లాలోనూ నిన్న 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాచలం జిల్లాల్లో ఉష్ణోగ్రత 21 డిగ్రీలు దాటింది. వేసవిలోకి అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతుండడం మున్ముందు ఎండలు ముదురుతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రజలు పలు సూచనలు పాటించాలని ముఖ్యంగా ఏవైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోవాలని వాతావరణ నిపుణులు (Meteorologists) సూచించారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా బయట తిరగవద్దని..ఒకవేళ అత్యవసర పరిస్థితిల్లో వెళ్లితే తప్పనిసరి ద్రవ పదర్థాలను తీసుకోవాలని ఘన పదర్థాలను విలైనంత తక్కువగా తీసుకోవాలని అన్నారు. తిరిగి వడదెబ్బకు గురికావొద్దని వారు సూచించారు. ఎక్కువగా పానీయాలను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు