»Bengaluru Police Warning On Rash Driving Video Viral
Viral Video : రాష్ డ్రైవింగ్ చేస్తున్నారా? ముందు ఈ వీడియో చూడండి
రోడ్డు మీదికి బైక్‌తో వస్తే చాలు కొందరు యువకులు రెచ్చిపోతారు. మామూలుగా కాదు. బైక్ తో రోడ్డు మీద స్టంట్స్ చేస్తుంటారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా డ్రైవ్ చేస్తుంటారు. రాష్ డ్రైవింగ్ చేసి ఇతరులను బెదరగొడతారు. కొందరైతే బిజీ రోడ్ల మీద రేస్‌లు పెట్టుకుంటారు
Viral Video : రోడ్డు మీదికి బైక్‌తో వస్తే చాలు కొందరు యువకులు రెచ్చిపోతారు. మామూలుగా కాదు. బైక్ తో రోడ్డు మీద స్టంట్స్ చేస్తుంటారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా డ్రైవ్ చేస్తుంటారు. రాష్ డ్రైవింగ్ చేసి ఇతరులను బెదరగొడతారు. కొందరైతే బిజీ రోడ్ల మీద రేస్‌లు పెట్టుకుంటారు. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తారు కొందరు. ఇదంతా రోడ్ల మీద ఉన్నవారి అటెన్షన్ కోసమే కొందరు చేస్తే.. మరికొందరు తమకు డ్రైవింగ్ బాగా వచ్చు అని నలుగురు అనుకోవాలని.. బైక్స్ పై స్టంట్స్ చేస్తుంటారు.
అలా.. బైక్స్ మీద స్టంట్స్ చేసి చాలామంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే కదా. అయినా కూడా యూత్ మాత్రం మారడం లేదు. అలాగే బైక్స్ మీద ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అదే పని చేశాడు. బెంగళూరులో రద్దీ రోడ్ల మీద స్కూటీతో పలు విన్యాసాలు చేవాడు. దాన్ని వీడియో తీసిన పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఒక మంచి క్యాప్షన్ పెట్టడంతో నెటిజన్లు ఆ క్యాప్షన్ ను చూసి సూపర్బ్ పోస్ట్ అంటూ బెంగళూరు పోలీసులను మెచ్చుకుంటున్నారు.
Viral Video : నువ్వు బతికే ఉంటే.. నీ కోసం వేచి చూస్తుంటాం అంటూ క్యాప్షన్
బెంగళూరు సిటీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో నువ్వు బతికే ఉంటే.. నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటామని తెలుసుకో.. అంటూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు పోలీసులు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వాహనదారులను హెచ్చరించేందుకు భలే ఐడియా వేశారు. ఏది ఏమైనా రోడ్లు మీద అలాంటి స్టంట్స్ చేయడం చాలా తప్పు అంటూ నెటిజన్లు ఆ కుర్రాడిపై ఫైర్ అవుతున్నారు. బెంగళూరులో ఇలాంటివి చాలా కామన్ అయ్యాయి అంటూ నెటిజన్లు పోలీసులకు కామెంట్లు చేస్తున్నారు.