Akkineni Akhil CCL కోసం వస్తున్నాడు.. ఫుల్ స్వింగ్‌లో ‘ఏజెంట్’!
Akhil : అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మోస్తారు రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. అందుకే ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మోస్తారు రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. అందుకే ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. అసలు ఈయన కటౌట్‌కి సరైన మాస్ సినిమా పడితే.. బాక్సాఫీస్ బద్దలవాల్సిందే. కానీ ఇప్పటి వరకు అఖిల్‌ను ఎవరు సరిగా వాడుకోలేదు. కానీ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం అఖిల్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే.. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతునే ఉంది. ఇటీవలె ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు సినిమాకు గుమ్మడి కాయ కొట్టలేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రజెంట్ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్ మస్కట్‌లో శరవేగంగా జరుగుతోంది.. అలాగే శనివారం అఖిల్ బెంగుళూరు సీసీఎల్ మ్యాచ్ కోసం రానున్నాడు.. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. కానీ వీలైనంత త్వరగా ఏజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా.. సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరి ఏజెంట్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.