NLR: సంగం మండలం గాంధీజన సంఘం సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై భోజ్యా నాయక్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం తరలించారు.