MDCL: జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ తగ్గించేందుకు పోలీసులు సిమెంట్ బ్లాకులతో రహదారిని మూసివేసి, కొంత దూరంలో యూ-టర్న్ ఏర్పాటు చేశారు. బాచుపల్లి-ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4ఏ మార్గంలో వాహనాల రాకపోకలు ఇప్పుడు సాఫీగా సాగుతున్నాయి. రాత్రివేళ భద్రత కోసం సిమెంట్ బ్లాకులపై రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేశారు.