ఖమ్మం నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 57వ డివిజన్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే నీటిలో నుంచి బయటకు తీసినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.