CTR: తోతాపూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. దశలవారీగా కాయలు కోతలు చేయాలన్నారు.