JN: నర్మెట్ట నూతన ఎంపీవోగా సంపత్ కుమార్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.