MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నూకల రాహుల్ లారీ ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.