BPT: బాపట్ల హైదర్ పేట వద్ద బుధవారం అర్ధరాత్రి ఇసుక లోడుతో వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ, ఓ ఐచర్ బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఐచర్ డ్రైవర్ క్యాబిన్ లోపల ఇరుక్కుపోయాడు. స్థానికులు అతడిని రక్షించి బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.