SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కొత్తకోటవారివీధి, పాతినవానిపేట గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బుధవారం పరామర్శించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టసుఖాలు తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.