VZM: జిల్లాలో ఎంపిక చేసిన 50 వసతి గృహాలను నెట్ జీరో & హెల్తీ క్యాంపస్లుగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలి దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు.