KNR: కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారిగా నల్లా వెంకట్ రెడ్డి బుధవారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గత ఆర్డీవో మహేశ్వర్ రిటైర్డ్ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నల్ల వెంకటరెడ్డిని కరీంనగర్ ఆర్డీవోగా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెంకట్ రెడ్డి తెలిపారు.