E.G: గోపాలపురంలో మాజీ హోం మంత్రి, గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్ తానేటి వనిత ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ను బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. గత ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. అనంతరం వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు.