కోనసీమ: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా బుధవారం అమలాపురంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సైకిల్ యాత్రను డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతాయి అన్నారు. మలికిపురం నుంచి సైకిల్ పై వచ్చిన బోనం రాజును క్లబ్ సభ్యులు అభినందించారు.