భోజనం చేయగానే ఒక్కసారిగా కళ్లు లాగేస్తూ, విపరీతమైన బద్ధకం, నిద్ర ముంచుకొచ్చే స్థితిని ‘ఫుడ్ కోమా’ అంటారు. భారీగా లేదా కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడు జీర్ణక్రియ కోసం రక్తప్రసరణ అంతా పొట్ట వైపు మళ్లుతుంది. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గి నిద్రమత్తు ఆవహిస్తుంది. అందుకే మితంగా, చిన్న చిన్న వాయిదాలుగా తినాలి. భోజనం తర్వాత నడవాలి.