BHNG: బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి సయ్యద్ హీన వివాహ ఖర్చుల నిమిత్తం స్థానికుడు అమరేందర్ రెడ్డి రూ. 10,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని ఇవాళ అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెజ్జంకి నరేంధర్ రెడ్డి, మైలారం మహేష్, ఉగ్గి నర్సింహులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.