ASF: కౌటాల మండల కేంద్రం 5వ వార్డులో నూతన CC రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ నక్క శంకర్ బుధవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గత కొంతకాలంగా వార్డు ప్రజలు రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వారి వినతి మేరకు MGNREGS 5 లక్షల నిధులతో ఈ సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.