బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతన సాంకేతికతతో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు కట్టుదిట్టం చేశామన్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి,పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్పై చర్యలు ఉంటాయని వెల్లడించారు.