NLG: ఆర్టీసీ డిమాండ్ డే సందర్భంగా డిమాండ్ బ్యాడ్జీలు ధరించి సోమవారం ఆర్టీసీ కార్మికులు నల్గొండ డిపో ముందు నిరసన తెలిపారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, ఎస్డ బ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ, ఆర్టీసీ కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.