NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో ఇవాళ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అవ్వ, తాతలకు, వికలాంగులకు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.