TG: అన్నింటిపైనా సోషల్ మీడియా ప్రభావం చూపిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సంకుచిత మనస్తత్వం వీడి.. విశాల దృక్పదంతో పని చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ‘మంచి విషయ పరిజ్ఞానం ఉండి.. బాగా మాట్లాడేవారిని ప్రోత్సహించాలని రాహుల్ చెప్పారు. పదవుల కంటే దేశం ముఖ్యమని ఆయన భావించారు’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.