సిద్దిపేట పట్టణంలోని శ్రీమార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. భక్తి ద్వారా జీవితంలో మానసిక ప్రశాంతతా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.