NLG: కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ ధరలను సవరించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో ఐకేఎస్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జీవో ప్రతులను దహనం చేశారు. ఎరువుల ధరలు పెంచి, సబ్సిడీలు తీసేయడంతో పెట్టుబడి పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో పండే పూర్తి ధాన్యాన్ని కేంద్రం కొనాలన్నారు.