CTR: శ్రీరంగారాజపురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపా లక్ష్మి పాల్గొన్నారు. క్రీడలు యువతలో ప్రతిభను వెలికితీసి మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతులు అందజేసి క్రీడాకారులను సన్మానించారు.