ATP: జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లను పిలిపించి పోలీస్ స్టేషన్లలో ముమ్మరంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత కొరకు శక్తి యాప్, స్త్రీరక్ష పోర్టల్ సేవలపై గ్రామసభల్లో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై నిఘా పెంచారు.