Jeevitha rajasekhar: 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తో జీవితా రీఎంట్రీ
జీవితా రాజశేఖర్ (Jeetha Rajasekhar) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ (lal salaam) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రకు జీవితా రాజశేఖర్ ను ఎంపిక చేసుకున్నారు.
జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ (lal salaam) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య (aishwarya) దర్శకత్వం (Director) వహిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రకు జీవితా రాజశేఖర్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో (Chennai) జరుగుతోంది. మార్చి 7వ తేదీ నుండి జీవిత (Jeevitha Rajasekhar) సినిమా షూటింగ్ లో (Film Shooting) పాల్గొంటారు. లాల్ సలామ్ సినిమాను (Lal Salaam film) లైకా – రెడ్ జెయింట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో (Tollywood) ఆమెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాజశేఖర్ తో (Hero Rajasekhar) పెళ్లికి ముందు ఆమె సూపర్ హిట్ హీరోయిన్. ఆ తర్వాత రాజశేఖర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల తన అమ్మాయిలు సినిమాల్లో నటిస్తుండటంతో కథలు వింటున్నారు. బిజీగా ఉండటం వల్ల చాలాకాలంగా ఆమె తెరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ చెల్లెలిగా కనిపించనున్నారు.
జీవిత తెలుగు సినిమా నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు కూడా. అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. 1984లో తమిళ దర్శకుడు టి.రాజేందర్ ‘ఉరవై కార్తకిలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్గా నటించారు. 1991లో డా.రాజశేఖర్ తో వివాహం జరిగింది. 1996 లో మొదటి కూతురు శివానీ (shivani rajashekar), 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు (Shivathmika Rajashekar). 1986 నుండి 1990 వరకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నటించారు. తలంబ్రాలు, ఆహుతి, డామిట్ కథ అడ్డం తిరిగింది, రాక్షస సంహారం, అన్నా చెల్లెలు, ఇంద్రధనస్సు, జానకి రాముడు, నవభారతం, బావా మరదళ్ల సవాల్, స్టేషన్ మాస్టర్, మంచివారు మావారు సినిమాల్లో నటించారు. 1990లో వచ్చిన అంకుశం సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా రాజశేఖర్ కు, జీవితకు మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. తెలుగు కంటే ఎక్కువ తమిళ సినిమాల్లో నటించారు. పెళ్లయ్యాక నటనకు దూరంగా ఉన్నారు. అయితే శేషు, మహంకాళి, సత్యమేవ జయతే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆప్తుడు, ఎవడైతే నాకంటి, మహంకాళి, శేఖర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఎవడైతే నాకేంటికి కోడైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. దెయ్యం సినిమాకు కో ప్రొడ్యూసర్.