»Arvind Kejriwal Accepted The Resignation Of The Two Ministers
Arvind Kejriwal: ఇద్దరు మంత్రుల రాజీనామాలకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా(Manish Sisodia), సత్యేందర్ జైన్(Satyendra jain) తమ మంత్రి పదవులకు రాజీనామా(resign) చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) వారి రాజీనామాలను ఆమోదించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సహా తన కేబినెట్ సహచరులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్(Satyendra jain) అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజీనామా చేయాలని బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi) మంత్రివర్గంలోని తమ పదవులకు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం రాజీనామా(resign) చేశారు. అరెస్టు చేసిన నేతలను ఢిల్లీ పరిపాలనలో ఎందుకు కొనసాగిస్తున్నారని బీజేపీ(bjp) ప్రశ్నించడంతో రాజీనామాలు చేశారు. ఢిల్లీ కేబినెట్లో ప్రస్తుతం కేజ్రీవాల్‌తో సహా ఐదుగురు మంత్రులు ఉన్నారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia)ను మార్చి 4 వరకు సీబీఐ(CBI) రిమాండ్‌కు పంపింది. దీంతో సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నిరసనలు చేపట్టింది. అందుకు బీజేపీ నేతలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ(CBI) “అవినీతి”పై చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. చట్టం తన పంథాలో నడుస్తోందని, దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా పనిచేస్తున్నాయని అన్నారు. దీంతోపాటు తన మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు కేజ్రీవాల్ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని భాటియా ఎద్దేవా చేశారు.