TG: గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిపై అబద్ధాలు చెప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులకు ఇవ్వలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు.