»Disha Police Saved Women And One Child In Tirupati
Disha Police రెండు ప్రాణాలను కాపాడిన దిశా పోలీసులు
భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు.
జీవితం మీద విరక్తితో తనువు చాలించాలనుకుంటే ప్రశాంతంగా చనిపోయే అవకాశం లేదని ఓ మహిళ బాధపడుతోంది. ఎందుకంటే ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుందనే సమాచారం తెలుసుకుని దిశా మహిళా పోలీసులు (Disha Women Police) కాపాడారు. ప్రశాంతంగా చనిపోనియ్యరా అంటూ ప్రశ్నిస్తూ తనను కాపాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్య యత్నాని (Suicide Attempt)కి పాల్పడుతున్న ఆమెను తక్షణమే స్పందించిన దిశా మహిళా పోలీసులు రక్షించి ఆమెకు కౌన్సిలింగ్ (Counselling) ఇచ్చారు. ఆమె కష్టాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన తిరుపతి (Tirupati)లో చోటుచేసుకుంది.
జిల్లా కేంద్రం తిరుపతిలో సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో తిరుపతి కమాండ్ కంట్రోల్ (Tirupati Command Control)కు ఫోన్ వచ్చింది. ఎవరో ఒక మహిళ తన పాపతో వెస్ట్ రైల్వే స్టేషన్ (West Railway Station) సమీపంలో ఆత్మహత్య చేసుకుబోతున్నదని దిశ మహిళ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన దిశ మహిళ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ మహిళ పాపతో కలిసి రైలు కోసం ఎదురుచూస్తున్నది. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వివరాలు సేకరించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
తనది రైల్వే స్టేషన్ సమీపంలోనే నివాసమని ఆమె పేర్కొంది. భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు. చిన్న చిన్న సమస్యలతో ఇరువురు మనస్పర్ధలు ఏర్పరచుకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని గుర్తు చేశారు. ఏ సమస్య అయినా ఆదిలోనే భార్యాభర్తలు ఇరువురు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలా గొడవపడి రోడ్డున పడకూడదని హితవు పలికారు. అనంతరం భర్త, కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను, పాపను క్షేమంగా ఇంటి వద్ద దిశా మహిళా పోలీసులు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ పరమేశ్వర రెడ్డి దిశ పోలీసుల సేవలను అభినందించారు.
ఆంధప్రదేశ్ లో దిశా పోలీసుల సేవలు అద్భుతంగా ఉన్నాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దిశా పోలీసులు చొరవ చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల క్షేమం కోసం దిశా పోలీసులు పని చేస్తున్నారు. ఆకతాయిల వేధింపులు, గృహ హింస, దాడులు వంటి సంఘటనలపై సత్వరమే స్పందిస్తున్నారు. నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సాంత్వన కల్పించేలా దిశా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దిశా పోలీసుల సేవలకు జాతీయ గుర్తింపు లభిస్తున్నది. ఇప్పటికే చాలా అవార్డులు దక్కాయి.