KNR: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను సీఈఐఆర్ (CEIR) టెక్నాలజీ సహాయంతో గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. లగాలమర్రి గ్రామానికి చెందిన మక్కల మధు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సాంకేతిక సహాయంతో ఫోన్ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితుడికి ఫోన్ను అప్పగించారు.