AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్-ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.