BHNG: బొమ్మలరామారం మండలం పిల్లి గుండ్ల గ్రామ తండాలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో సర్పంచ్ ధీరవత్ వాలు ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ నిధుల సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ గణేష్, నరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.