»American Actress Tig Notaro Apologized To Ram Charan Hca Film Awards 2023
Ram Charan:కు క్షమాపణ చెప్పిన అమెరికన్ నటి నొటారో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో చెర్రీ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఆ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో చరణ్ పేరు పలకడంలో నోటారో ఇబ్బంది పడ్డారు. అందుకు గాను ఆమె చెర్రీకి అపాలజీ తెలియజేశారు.
అమెరికన్ స్టార్ నటి టిగ్ నొటారో(Tig Notaro).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు క్షమాపణ తెలిపారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్(Hollywood Critics Association Film Awards) వేదికపై ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నటి చరణ్ కు వేదికపై క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చరణ్ అవార్డ్ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బెస్ట్ వాయిస్/మోషన్ క్యాప్చర్ అవార్డును హాలీవుడ్ నటి అంజలి భీమిని(Hollywood actress anjali bhimani)తో కలిసి చరణ్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హాలీవుడ్ నటి టిగ్ నోటారో వేదికపైకి చరణ్‌ని పిలుస్తుండగా చరణ్ పేరు మర్చిపోయినట్లు వ్యవహరించారు. చెర్రీ పేరును పూర్తిగా పలకడంలో ఇబ్బంది పడ్డారు. రామ్ అని పలికి కాసేపటికీ చరణ్ అంటూ పూర్తి పేరును నటి చెప్పారు. ఆ క్రమంలో చరణ్ పేరును పలకడంలో తడబడిందనందుకు విశ్వవేదికపై చరణ్‌కు ఆమె క్షమాపణలు చెప్పారు.
హెచ్‌సీఏ అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్(RRR) మూవీ(movie) నాలుగు విభాగాల్లో పురస్కారాలను గెల్చుకుంది. ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చరణ్ అవార్డు ప్రజెంటర్ గా హాజరయ్యారు. అదే క్రమంలో టిగ్ నొటారో(Tig Notaro) వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ వేడుకకు హాలీవుడ్ నటి అంజలి భీమాని(anjali bhimani)తో కలిసి చరణ్ బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ అవార్డును అందించారు.
మరోవైపు అంతర్జాతీయ వేదికపై చరణ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేయడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చరణ్‌తో పాటు అవార్డును అందజేయడానికి వచ్చిన నటి భీమని( anjali bhimani) వేదికపై మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. “రామ్ చరణ్ లాంటి స్టార్ తో ఈ అవార్డును అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇది తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్’ అని ఆమె అన్నారు. మరోవైపు ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్(RRR) మూవీ(movie).. ఈ వేదికపై ఐదు అవార్డులతో మెరిసింది. దర్శకధీరుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ అవార్డులను అందుకున్నారు.
మరోవైపు ఇలాంటి అంతర్జాతీయ వేడుకల్లో కనీసం హీరో పేరు కూడా స్పష్టంగా పిలువకపోవడం పట్ల మరికొంత మంది అభిమానులు(fans) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఓసారి ఆ పేర్ల జాబితాను చూసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇంకోవైపు నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది. ఈ క్రమంలో మార్చి 12న అమెరికా(USA) లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.