»Implement President Rule In State Sharmila Asked To Governer
ys sharmila meet governer:రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి, గవర్నర్కు షర్మిల వినతిపత్రం
ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్లో (Raj bhavan) గవర్నర్తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.
implement president rule in state, sharmila asked to governer
ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్లో (Raj bhavan) గవర్నర్తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో (Telangana) ఏ వర్గానికి రక్షణ లేదన్నారు. లా అండ్ ఆర్డర్ (law and order) అమల్లో లేదు. ప్రతి పక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మహిళలకు గౌరవం లేదన్నారు. ప్రతి పక్షాల గొంతు నొక్కి ప్రజా స్వామ్యాన్ని అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరారు.
దేశంలో రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని షర్మిల (ys sharmila) దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేకుండా చేశారన్నారు. ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్ (kcr), బీఆర్ఎస్కు (brs) ఎందుకు అంత అసహనం అర్థం కావడం లేదన్నారు. ప్రతి పక్షాలు ప్రజల కోసం కొట్లాడుతుంటే విపరీతంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వీధి కుక్కలు దాడి చేసి చిన్న పిల్లలను దాడి చేసి చంపేస్తే ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. ఏ నియోజకవర్గంలో అయినా సరే ప్రతిపక్షాలను బయటకి కూడా రానివ్వడం లేదన్నారు.బీఆర్ఎస్ నేతలు (brs leaders) కాంగ్రెస్ యువ నాయకుడిని దాడి చేశారని గుర్తుచేశారు.
పోలీసులు, యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని దాడులు చేస్తున్నారని షర్మిల (ys sharmila) విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు లేరు.. ఉన్నదల్లా గూండాలు మాత్రమేనని ధ్వజమెత్తారు. ప్రతి పక్షంగా తాను 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసి మీ అవినీతిని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు దూషించి , పోలీసుల (police) చేత అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ (friendly policing).. మిగతావారికి కాదన్నారు. గత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారని అడిగారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు.
భూములు కబ్జా చేసి అక్రమంగా సంపాదించుకున్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ కేసీఆర్ (kcr) టికెట్లు ఇస్తారని చెప్పారు. కేసీఆర్ నియంత పాలనలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే తనకు లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాలని తాము కోరుతున్నామని.. విపక్షాలు కూడా కోరాలని అన్నారు. ఇదే అశంపై రాష్ట్రపతి వద్దకు వెళతామని చెప్పారు.
మెడికో ప్రీతికి (preethi) షర్మిల (ys sharmila) సానుభూతి తెలిపారు. ఆత్మహత్యా యత్నం చేసిన మరో మెడికల్ స్టూడెంట్కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి తెలిపింది. పోడు భూముల కోసం కొట్లాడిన, మహిళలను జట్టు పట్టుకు లాక్కెళ్లారు, లాయర్లను నడి రోడ్డుపై నరికేసినా చర్యలే లేవని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు. డ్రగ్స్ , ఆల్కహాల్ విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ కుంభకోణలో పెద్ద వాళ్లున్నారని.. పేర్లు వస్తున్నా ఎవ్వరినీ అరెస్ట్ చేయరని పేర్కొన్నారు. తాము చెప్పిన అంశాలను గవర్నర్ (governer) విన్నారు. ఈ అంశాలను ప్రెసిడెంట్ని (president) కలిసి ప్రస్తావిస్తామని తెలిపారని చెప్పారు.