హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. కాలనీలు, బస్తీలు, గల్లీల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా బైకర్లు, నడిచి వెళ్లే వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నాయి. దీంతో తమ ఏరియాల్లో కుక్కలను అరికట్టాలంటూ జీహెచ్ఎంసీ (Ghmc) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం36 గంటల్లోనే15 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఈ లెక్కన చూసుకుంటే జీహెచ్ఎంసీ గంటకు 416 ఫిర్యాదులు అందుకుంది. అంబర్ పేట్(Amber Pate) బాలుడి ఘటన తర్వాత సిటీలో కుక్కల సమస్య మరింత తీవ్రమైంది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు 10 ఫిర్యాదులను సిబ్బంది అటెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వీధి కుక్కలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ (Hyderabad) సిటీ పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని, ముఖ్యంగా కుక్కల (dogs) సమస్య అధికంగా ఉన్న చోట తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
జీహెచ్ఎంసీ Ghmc) ఆఫీసర్స్. అత్యవసరమైతే 040-21111111 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయాలని కోరుతున్నారు.కాగా.. కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి(Vijayalakshmi) ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో 5 లక్షల 70 వేల కుక్కలు ఉన్నాయని, ఇందులో 4 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. కుక్కలను పట్టుకోవడం కోసం 30 టీమ్ లు పని చేస్తున్నాయని తెలిపారు. కుక్కలకు సంబంధించిన విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు.కాగా.. హైదరాబాద్ (Hyderabad)లో తాజాగా జరిగిన వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచి వేసింది.