ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్. అయినా ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక బోరుమందట. అయితే ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. కానీ దీన్ని ఈ హాట్ బ్యూటీ మర్చిపోలేకపోతోందట. తెలుగులో ‘చలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. ఆ తర్వాత ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన లిప్ లాక్.. అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కన్నడలో రష్మిక లిప్ లాక్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది రష్మిక. ఇద్దరు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఈ లిప్ లాక్‌తో ఇద్దర బ్రేక్ చెప్పేసుకున్నారని టాక్. ఈ విషయం రష్మికను పెద్దగా బాధించకపోయినా.. లిప్ లాక్ పై జరిగిన ప్రచారమే అమ్మడిని నిద్రపోకుండా చేసిందట.
దాంతో కొన్ని రోజులు అలాగే ఏడుస్తు ఉండిపోయానని.. డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయానని.. హిందీ మూవీ ‘గుడ్ బై’ ప్రమోషన్లో చెప్పుకొచ్చింది రష్మిక. దాంతో మరోసారి రష్మిక లిప్ లాక్ న్యూస్ వైరల్‌గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ్, హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్లో యానిమల్, మిషన్ మజ్ను సినిమాలు చేస్తోంది. ఇక తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్నవిజయ్ ‘వారసుడు’లోను నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో పుష్ప2 చేస్తోంది. మొత్తంగా రష్మిక ఇప్పుడు మాంచి దూకుడు మీదుందని చెప్పొచ్చు.