AP: ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇవాళ సీబీఐ కోర్టుకు వెళ్లనున్నారు. సీబీఐ అధికారులు.. ఆయేషా అస్థికలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రుల సమక్షంలో తెనాలిలో అస్థికలను ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయేషా న్యాయపోరాట కమిటీ చలో తెనాలికి పిలుపునిచ్చింది. ఆయేషా శరీర అవశేషాలు ఖననం కార్యక్రమానికి న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు హాజరుకానున్నాయి.