ఆదిపురుష్ టీజర్లో రావణాసురిడికి రామబాణాన్ని ఎక్కుపెట్టిన ప్రభాస్.. రియల్ లైఫ్‌లోను రావణ దహనం చేయబోతున్నాడు. ఈ సారి దసరాకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా జరగనుందని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. అయితే ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు మరణంతో.. ప్రభాస్ ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది సందేహంగా మారింది. కానీ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ చేసిన సమయంలో దర్శకుడు ఓం రౌత్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు మరోసారి రావణ దహనానికి ప్రభాస్ వెళ్తున్నాడని ఫిక్స్ అయిపోయింది. ఈసారి ప్రభాస్ రావణ దహనానికి వస్తున్నాడని రామ్‌లీలా కమిటీ కన్ఫామ్ చేసినట్టు సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లతో కలిసి.. ప్రభాస్ రావణ దహనం చేయబోతున్నాడని తెలుస్తోంది. దాంతో ఈసారి రామ్‌లీలాలో ఈ ముగ్గురూ రావణుడిపైకి బాణాలను సంధించనున్నారని చెప్పొచ్చు. అలాగే తెలుగు నుంచి ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న ఘనత ప్రభాస్‌కే దక్కిందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఆదిపురుష్ చిత్రం వచ్చే సంక్రాతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఔం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటిస్తున్నారు. మరి ఎన్నో విమర్శలకు దారి తీస్తున్న ‘ఆదిపురుష్’ ఎలా ఉంటుందో చూడాలి.