BHPL: జనగణన సర్వేలో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణనను ఖచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం BHPL ఐడీఓసీ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చిత సమాచారం నమోదు చేయాలని సూచించారు.